08-07-2025 10:49:32 PM
శేరిలింగంపల్లి: తెలంగాణ సగర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర పుట్టినరోజు వేడుకలను హైద్రాబాద్, చందానగర్, పాపిరెడ్డి కాలనీలోని శారద విద్యానికేతన్ అనాధ శరణలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర కేక్ కటింగ్ చేయించి, పండ్లు పంపిణీ చేశారు. అనాధ ఆశ్రమంలోని అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలతో కేక్ కటింగ్ చేపించి పిల్లలకు పండ్లు, భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి బంగారు ఆంజనేయలు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటరాములు సగర, రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ నార్లకంటి నరేందర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ యువజన సగర సంఘం కార్యనిర్వాహన కార్యదర్శి గుంటి వినోద్ సగర, దిండి సాయి బాబు సగర తదితరులు హాజరయ్యారు.