08-07-2025 10:45:43 PM
ఏపీఎం అజయ్ నాయక్...
పెన్ పహాడ్: మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఆర్థిక స్వావలంబన దిశగా సామాజిక ప్రగతికి దోహదపడేలా రూపొందించబడిన కార్యక్రమమే 'ఇందిరా మహిళా శక్తి' పథకమని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం అజయ్ నాయక్(APM Ajay Nayak) అన్నారు. మంగళవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని సెర్ఫ్ కార్యాలయంలో ఆయా గ్రామాల సంఘబంధం బాద్యులు, వీఓఏ లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సంబరాలలో భాగంగా 2024-25 ఎస్.ఎచ్. జి, ద్వారా సాధించిన ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలు, సంఘ బలోపేతం, మహిళా రాజకీయ ప్రగతి, వివిధ రంగాలలో సాధించిన హోదాలు గుర్తు చేసుకుంటూ.. వచ్చే సంవత్సరానికి మహిళా శక్తి సంబరాలకు మరింత పాముఖ్యత ఉండేలా మహిళలు ముందుకు పోవాలని ఏపీఎం కోరారు. కార్యక్రమంలో సీసీలు శైలజ పద్మావతి, ఆశ, ఎమ్మెస్ అధ్యక్షురాలు, కోశాధికారి ఊట్కూరు మంజుల ఉపేంద్ర, శ్రీనిధి మేనేజర్ జ్యోతి, వీవోఏలు స్వరూప, లత, విజయ, శ్రీను, మధు, కళ్యాణి, జయమ్మ తదితరులు ఉన్నారు.