08-08-2025 12:26:44 AM
భర్తీకానున్న 1,284 పోస్టులు
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): చాలాకాలంగా ఎదురుచూస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఈ మేరకు త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. సెలక్షన్ లిస్టు విడుదల కాగానే రాష్ట్రవ్యాప్తంగా 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఆస్పత్రుల్లోకి కొత్త ఉద్యోగులు రానున్నారు.
కాగా గతేడాది 1,284 ల్యాబ్ టెక్నీషియన్ భర్తీకి రాత పరీక్షలు నిర్వహించారు. అయితే సర్టిఫికెట్ల ఆధారంగా అభ్యర్థులకు ఇచ్చిన వెయిటేజీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు మెడికల్ బోర్డు దృష్టికి వచ్చింది. దీంతో అభ్యర్థులు ఇచ్చిన సర్టిఫికెట్లు ఒరిజినల్‌వేనా లేక ఫేక్ సర్టిఫికెట్లా అని తేల్చేందుకు వాటిని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలకు పంపారు. ఈ క్రమంలోనే మెరిట్ లిస్ట్ జాబితా రూపొందించడం ఆలస్యమైంది.