05-09-2025 07:28:51 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలను శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని జిమ్మ బిలాల్ మసీదులో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర జీవనశైలి గురించి వివరించారు. ప్రవక్త సర్వ మానవాళి శాంతితో ఉండాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు మహ్మద్ ప్రవర్త చూపిన బాటలోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.