05-05-2025 04:24:13 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పసుపు పంటకు ఈ సీజన్లో అత్యధిక ధర క్వింటాలకు రూ.13,852 లభించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు సుమారు 300 బస్తాల కాడి, గోల రకం పసుపు విక్రయానికి వచ్చింది. ఈ సీజన్లో అత్యధిక సోమవారం నమోదయ్యింది. గత వాన కాలంలో సాగు చేసిన పసుపు పంట దిగుబడి రైతులకు ఇప్పుడిప్పుడే చేతికి అందుతుండంతో రైతులు విక్రయానికి తెస్తున్నారు. సోమవారం కేసముద్రం మార్కెట్లో కాడీ రకం పసుపు క్వింటాలకు గరిష్టంగా 13,852 రూపాయలు లభించగా, కనిష్టంగా 9,569, గోళా రకానికి గరిష్టంగా 12,051, కనిష్టంగా 8,659 రూపాయల ధర లభించింది.