calender_icon.png 5 May, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

05-05-2025 12:25:19 AM

గూడూరు, మే 4 (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలో అనారోగ్యానికి గురైన తేజావత్ సురేష్  కుమారుడికి  ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 20 వేల రూపాయల చెక్కును గ్రామ పార్టీ అధ్యక్షుడు వాంకుడోత్ నవీన్, బానోత్ లక్ష్మణ్, సంతోష్ అందజేశారు.

అనారోగ్య కారణాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరఫున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు.  కార్యక్రమంలో బానోత్. విష్ణువర్ధన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.