05-09-2025 03:45:09 PM
అలంపూర్: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఎంతో సమయోచితమై, ప్రజల జీవనానికి గొప్ప ఊరటను అందించిందని బిజెపి మండల అధ్యక్షులు మురళీ కృష్ణ(BJP Mandal President Murali Krishna) అన్నారు. బుధవారం మండల కేంద్రంలో భారత ప్రధాని మోడీ చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ దృష్టి, సమయోచిత నిర్ణయాలు, దూరదృష్టి ఆలోచనలు అభినందనీయమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాజశేఖర్ శర్మ, రాఘవయ్య, బాబు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.