05-09-2025 04:04:38 PM
ఎల్లయ్య పార్తివ దేహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
అమీన్పూర్ (విజయక్రాంతి): కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య మరణం కార్మిక రంగానికి తీరని లోటని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. ఎల్లయ్య మరణ వార్త తెలిసిన వెంటనే.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట గ్రామ పరిధిలో గల ఎల్లయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించారు. బిహెచ్ఎల్ తో పాటు వివిధ పరిశ్రమల్లో కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం తుదికంటూ పోరాడిన మహోన్నత నాయకుడు ఎల్లయ్య అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.