30-12-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
మహబూబాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులతో కలిసి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వి విధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాల కు పంపి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సోమవారం వివిధ విభాగాలకు చెందిన మొత్తం 86 ప్రజావాణి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో పురుషోత్తం, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి.మరియన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, దేశి రామ్ నాయక్, శ్రీనివాసరావు, శ్రీనివాస్, డిపిఓ హరిప్రసాద్, ఎల్డిఎం యాదగిరి, వెల్ఫేర్ అధికారిని సబిత, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, మెప్మా ప్రాజెక్ట్ అధికారిని విజయ, పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, సివిల్ సప్లై డీ ఎం కృష్ణవేణి, డీఎస్‌ఓ రమేష్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.