calender_icon.png 19 December, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం దించుకున్న మిల్లర్లు వెంటనే రశీదు పంపించాలి

19-12-2025 12:42:06 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : కస్టపడి ధాన్యం పండించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాలో జమ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ,  జిల్లా సహకార సంఘం, సివిల్ సప్లై అధికారులతో వరి కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నాము, ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాల్సి ఉంది, ఇప్పటి వరకు ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయ్యాయి అనే వివరాలను సమీక్షించారు.

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇంకా మరో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా దాదాపు 21 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్యాబ్ ఎంట్రీ పెండింగ్ లో ఉందని, మిల్లర్లు దించుకున్న ధాన్యానికి సంబంధించి వెంటనే రశీదు పొంచాలని సూచించారు.

మిల్లర్లు రశీదు ఇవ్వకపోవడం వల్ల ట్యాబ్ ఎంట్రీ కాకుండా రైతులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. మిల్లర్ల నుండి రశీదు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, పి.డి. డీఆర్డిఒ ఉమాదేవి, జిల్లా సహకార సంఘం అధికారి ఇందిరా, జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం. జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.