19-12-2025 12:43:48 AM
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్, డిసెంబర్ 18: గ్రామాలను అభివృద్ధి పరిచి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆ దిశగా నూతన సర్పం చులు కృషి చేయాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఆకాంక్షిం చారు. ఈ మేరకు గురువారం కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్సీ చల్లా నివాసంలో నూత న సర్పంచులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల విజయం సాధించిన సర్పంచులను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు ఘనంగా పూల మాలలతో శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ... గ్రామాల్లో బిఆర్‌ఎస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థులు గెలుపొందడం శుభపరిణామం అన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థుల మద్దతుదారుల గెలుపుకు కృషిచేసిన ప్రతి కార్యకర్త కష్టపడ్డారని కొనియాడారు.
అనంతరం పుల్లూరు సర్పంచి సునీత, బోరవెల్లి సర్పంచ్ హరిచంద్రారెడ్డి, షాబాద్ సర్పంచ్ డేవిడ్ ,పల్లెపాడు సర్పంచ్ రమేష్ ఎర్రవల్లి సర్పంచ్ ఉప్పరి అనిత, బుక్కాపురం సర్పంచ్ రూప దేవి, బైనపల్లి సర్పంచ్ ముక్తార్, బుడ్డారెడ్డిపల్లి సర్పంచ్ కురువ సావిత్రి, తక్కశిల సర్పంచ్ రామకృష్ణారెడ్డి ఉట్కూరు సర్పంచ్ అయ్యమ్మ ,సుల్తానాపురం సర్పంచ్ మురళి గౌడు, మద్దూరు సర్పంచ్ ఇందిరా, ధర్మవరం సర్పంచ్ వెంకటేశ్వరమ్మ ,బొంకూరు సర్పంచ్ బోయ దేవన్న,
కొరిపాడు, సర్పంచ్ సరస్వతమ్మ, లింగన్నవాయి సర్పంచ్ చంద్రకళ సింగవరం 2 సర్పంచ్ మోహన్, క్యాతూరు సర్పంచ్ హరికృష్ణ, పెద్ద ధన్వాడ, సర్పంచ్ నారాయణమ్మ షేకుపల్లి సర్పంచ్ వెంకట లక్ష్మమ్మ, వీరాపురం సర్పంచ్, చిన్న సంజీవ నాయుడును పూలమాలలు వేసి శాలువతో సన్మానించారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు