24-07-2025 12:00:00 AM
కమాన్ పూర్, జూలై-23(విజయ క్రాంతి); ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం కలెక్టర్ కమాన్ పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని రొప్పికుంట లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, జడ్పిహెచ్‌ఎస్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పేరపల్లి గ్రామంలోని ఎంపిపిఎస్, పీ.హెచ్.సి సబ్ సెంటర్, కమన్ పూర్ మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల భవితా కేంద్రం, ప్రాథమిక పాఠశాల , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లను కలెక్టర్ పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శ్రీ మాల, డివిజనల్ పంచా యతీ అధికారి సతీష్, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ మంథని డాక్టర్ రవి సింగ్, కమాన్ పూర్ ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి మారుతి, పంచాయతీరాజ్ ఏఈ జగదీష్, మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, మం డల వ్యవసాయ అధికారి రామకృష్ణ, డి.ఈ . దస్తగిరి,ఎం.ఎల్.హెచ్.పి. డాక్టర్ సంగీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్ తక్షణమే విడుదల చేయాలి
ముస్తాబాద్,జూలై 23 (విజయక్రాంతి)ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంధు విజయవంతంగా ముగిసింది.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో నెలకొన్న సమస్యలతో పాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యాసంస్థల బందు విజ యవంతం అయిందని మెతుకు అజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభిలాష్, అజయ్, మందడి సంజయ్,డబ్బేడా శివ,పులి వినయ్ తదితరులు పాల్గొన్నారు.