24-07-2025 12:00:00 AM
జుక్కల్, జులై 23, ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం జుక్కల్ మండలం పెద్ద ఏడిగి గ్రామపంచాయతీ లో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
మద్నూర్ ఏఎంసీ చైర్మన్ అయిల్ వార్ సౌజన్య రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీతోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శారద సూర్యకాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగు నాయుడు ఈరప్ప, శ్రీకాంత్ అప్ప మాజీ ఎంపిటిసి నాగేష్ , గ్రామపంచాయతీ సెక్రెటరీ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.