27-09-2025 08:08:55 PM
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సీతారామారావులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నర్సింలు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ, పద్మశాలి సంఘం అధ్యక్షులు అప్పం శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాదులు వసంత సత్యనారాయణ, తల్లమల్ల హసేన్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చల్లమల్ల నరసింహ, టీఎన్జీవో జిల్లా సెక్రటరీ దున్న శ్యామ్, మడిపడిగ సైదులు, పెండెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.