05-07-2025 09:36:42 PM
సంఘటిత శక్తిగా మారితేనే హిందువులకు రక్ష
పెహల్గాం ఘటన తరువాత హిందువుల ఆలోచనల్లో మార్పు వచ్చింది
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ లో శనిబరంబురాత్రి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులందుకున్న సంజయ్ పెహల్గాం ఘటన తరువాత హిందువుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హిందువులంతా ఏకమై ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సంఘటిత శక్తిగా మారితేనే హిందువులకు రక్ష అని పేర్కొన్నారు. జగన్నాథ రథయాత్రలో భాగంగా టవర్ సర్కిల్ వద్దకు విచ్చేసిన బండి సంజయ్ మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు బసవ లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు బండి సంజయ్ కు ఆశీర్వచనం అందించారు.