calender_icon.png 28 September, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదర్ డెయిరీ డైరెక్టర్ ను అభినందించిన మంత్రి

28-09-2025 10:32:36 PM

చిట్యాల (విజయక్రాంతి): మదర్ డెయిరీ డైరెక్టర్ గా ఎన్నికైన కర్నాటి జయశ్రీని ఆదివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేముల వీరేశం అభినందించారు. నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం మదర్ డయిరి డైరెక్టర్ గా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన కర్నాటి జయశ్రీ ఎన్నికయ్యారు. ఆర్మూర్ డైరెక్టర్ పదవి కోసం శనివారం నిర్వహించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున జయశ్రీ పోటీ చేసి గెలుపొందగా రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం కర్నాటి జయశ్రీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.