28-09-2025 11:15:51 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని కూకుడ గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద ఎస్‌ఐ సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో పండగలు నిర్వహించుకోవాలని కులమత బేధాలు చూపెట్టకూడదని తెలిపారు. అందరూ కలిసి ఉంటేనే గ్రామం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని అన్నారు. ప్రజలందరూ ఏకమైతేనే గ్రామంలోని సమస్యలు సైతం పరిష్కారం అవుతాయని అన్నారు. ఎస్సై సర్తాజ్ పాషా అన్నదానం ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు ఎస్సైని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.