28-09-2025 11:02:28 PM
నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి
నల్లబెల్లి (విజయక్రాంతి): మండల ప్రజలందరూ దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏసీపీ నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో దసరా ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశానికి ఏర్పాటుచేసిన సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన పండుగలలో గొప్ప పండుగ సద్దులు బతుకమ్మ పండుగ, దసరా అన్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో శాంతియుత వాతావరణంలో పండుగ జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అధికారులు ఉత్సవాల సందర్భంగా ఎవరూ చట్టంగానే ఉల్లగించకూడదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మండల ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ, సీఐ సాయి రమణ, ఎస్‌ఐ గోవర్ధన్, వివిధ పార్టీల నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.