28-09-2025 10:34:52 PM
మందమర్రి (విజయక్రాంతి): మృదురాలి మెడలో నుండి రెండు తులాల బంగారు గొలుసు అపహరించిన ఘటన మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన తోట మల్లమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండగా కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడుతున్నారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలు మెడలో నుండి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. అప్రమత్తమైన వృద్ధురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చే సరికి దొంగ పారిపోయాడు. ఈ మేరకు వృద్ధురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ కే శశిధర్ రెడ్డి రామకృష్ణపూర్ ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని ఆదారాలు సేకరించారు.