calender_icon.png 29 September, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళను బెదిరించి డబ్బు బంగారం దోచుకున్న వ్యక్తి అరెస్ట్

28-09-2025 11:04:17 PM

దొంగ నుంచి బంగారం కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై బెదిరింపు దొంగతనం కేసును ఆదివారం పోలీసులు చేదించారు. బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం తెలుగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ ఈనెల 19న సాయంత్రం ఏడు గంటలకు బాన్సువాడకు చెందిన నీరడి సాయిలు పోచమ్మ గల్లి వద్దకు పిలిచి బెదిరించి ఆమె వద్ద ఉన్న 50వేల నగదు, అర తులం బంగారు హారం, సెల్ ఫోన్ దోచుకున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బాన్స్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ సిఐ అశోక్ సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుడు సాయిలు ఆదివారం అరెస్టు చేయడమే కాకుండా అతడు దొంగలించిన బంగారాన్ని లక్ష్మీనరసింహ గోల్డెన్ సిల్వర్ షాప్ బాన్సువాడ కు చెందిన వ్యక్తి బుర్ర వెంకటరమణ విక్రయించగా విచారణలో చెప్పడంతో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించి నట్లు డి.ఎస్.పి తెలిపారు. వారి వద్ద నుంచి 11 గ్రాముల బంగారు గుండ్ల హారం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినందుకు తరలించినట్లు డీఎస్పీ విటల్ రెడ్డి తెలిపారు. ఎస్పి రాజేష్ చంద్ర బాన్సువాడ పోలీసులను అభినందించినట్లు డిఎస్పి పేర్కొన్నారు.