calender_icon.png 29 September, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్

28-09-2025 11:12:41 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని అతి పురాతన ప్రాచీన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రజలందరూ స్వామి కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.