28-09-2025 11:10:51 PM
కాటా సునీతరాజేష్ గౌడ్..
అమీన్ పూర్: బతుకమ్మ ప్రకృతి సౌందర్యానికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ ప్రకృతిని ఆరాధిస్తూ, మహిళల ఐక్యతను, పర్యావరణ పరిరక్షణకు సూచిస్తుంది. బతుకమ్మను రంగురంగుల పూలతో అలంకరించి, స్త్రీలు బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని బిఆర్ఎస్ మహిళా నాయకురాలు కాటా సునీత రాకేష్ గౌడ్ తెలిపారు. బతుకమ్మ పండుగ పునస్కరించుకొని కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో అమీన్ పూర్ పెద్ద చెరువు కట్ట, సాయిబాబా గుడి దగ్గర ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమీన్ పూర్ లోని వివిధ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రజల అస్తిత్వానికి బతుకమ్మ ప్రతీక అని తెలిపారు.బతుకమ్మ అనేది ప్రకృతిని దైవంగా పూజించే ఒక విశిష్టమైన పండుగ, స్థానికంగా లభించే రకరకాల పువ్వులతో అందంగా అలంకరించిన బతుకమ్మను గౌరీ దేవికి నివాళిగా సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.