calender_icon.png 20 August, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల వివరాలపై మంత్రి కోమటిరెడ్డి ఆరా

20-08-2025 07:13:41 PM

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల వివరాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) ఆరా తీశారు. కల్వర్టులు, బ్రిడ్జిలు, దెబ్బతిన్న రోడ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, కల్వర్టుల వద్ద పునరుద్దరణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వంతెనల శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. అలాగే కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులను కూడా మంత్రి కోమటిరెడ్డి తెలుసుకున్నారు.