calender_icon.png 20 August, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రిని పట్టించుకోని కుమారులపై చర్యలు తీసుకోవాలి: బలం బీరప్ప

20-08-2025 09:32:54 PM

చండూరు,(విజయక్రాంతి): ఆ తండ్రికి ముగ్గురు కుమారులు తనకు తెలియకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని, వృద్ధాప్యంలో తనను పట్టించుకోకుండా రోడ్డుపాలు చేశారని  సంఘటన  గట్టుప్పల  మండలంలోని నామాపురం గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా  అదే గ్రామానికి  చెందిన  బలం బీరప్ప   బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  తను 9 ఎకరాల 17 గుంటలు భూమి ఉందని, రెండు ఫ్లాట్లు, సొంత జాగా ఉందని తెలిపారు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు హైదరాబాదులో జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

రెండవ కుమారుడు చాకచక్యంగా, అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, నన్ను పట్టించుకోకుండా  దూషిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇల్లును అక్రమంగా కూలగొట్టి   గ్రామపంచాయతీ రికార్డులో నమోదు చేసుకున కానీ రద్దుచేసి నా ముగ్గురు కుమారులకు సమానంగా పంపిణీ చేసి నాకు న్యాయం చేయాలని కోరారు. తన కుమారులు బాగోలు చూడని  వారిపై ఉన్న రిజిస్ట్రేషన్ లను క్యాన్సల్ చేయాలని  అధికారులను కోరారు. ఈ సంఘటనపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎంపీడీవో , ఎస్సై,అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎంపీడీ, సెక్రెటరీ   విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.