20-08-2025 09:06:39 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ న్యూ శాయంపేటలోని పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య దంపతులు 5 కిలోల 250 గ్రాముల వెండితో తయారుచేసిన అమ్మవారి తొడుగులను గురువారం బహుకరించనున్నారు. న్యూ శాయంపేట గ్రామస్తులు, భక్తులు, కార్పొరేటర్ల సమక్షంలో వెండి తొడుగులను అమ్మవారికి సమర్పించనున్నారు.