calender_icon.png 20 August, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై లారీ బోల్తా

20-08-2025 09:23:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్న సరుకుల లారీ నడిరోడ్డుపై బోల్తాపడడంతో ట్రాఫిక్ స్తంభించింది. గంటసేపు రాకపోకలు నిలిచిపోవడంతో నర్సాపూర్ పోలీసులు ప్రోక్లైన్లను తీసుకువచ్చి బోల్తా పడిన లారీని పక్కకు నెట్టు వేయడంతో ట్రాఫిక్ ను తిరిగి ప్రారంభించారు దీంతో ప్రజలు గంటసేపు ఇబ్బందికి గురయ్యారు.