20-08-2025 09:36:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి పంపిణీ చేశారు. ఆసుపత్రిలో చికిత్సలు పొంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉష్ణవేణి కొట్ట శేఖర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.