calender_icon.png 21 August, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ

20-08-2025 09:18:43 PM

రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): టెక్నాలజీ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు కొనియాడారు. దేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పాల్వంచలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

స్థానిక రాజీవ్ కూరగాయల మార్కెట్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రతల కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు బలిదానం అయ్యారన్నారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు మతసామరస్యాన్ని కాపాడాలన్నారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్దులు కావాలన్నారు.