calender_icon.png 20 August, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో ఖానాపూర్ వాసికి చోటు

20-08-2025 09:01:51 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ వాస్తవ్యులుకు చోటు దక్కింది. ఖానాపూర్ వాస్తవ్యుడైన పిసుపాటి వెంకటప్పయ్యకు రాష్ట్ర కార్యవర్గంలో సహాయ కార్యదర్శిగా చోటు కల్పించారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో అతనికి నియామక పత్రం అందజేశారు. బ్రాహ్మణ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని వెంకటప్పయ్య అన్నారు.