20-08-2025 06:50:35 PM
హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు(Ranganayaka Sagar Project)ను మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు సాక్షిగా మాట్లాడుకుందాం రండి.. ఎవరు వస్తారో చెప్పాలని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో 213 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకోవాట్లేదని.. ఎల్లంపల్లి వద్ద 5 లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని అన్నారు. రాజకీయాలు మాని అన్ని మోటార్లు ఆన్ చేయాలన్నారు.