31 March, 2026 | 11:38 PM

కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

07-12-2024 01:23 PM

రాష్ట్ర టూరిజం పర్యాటకశాఖ ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి, (విజయక్రాంతి): అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని కౌలాస్ కోటను పరిరక్షించడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక టూరిజం ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ కోటను ఆయన సందర్శించారు. కౌలాస్ కోటలోని ప్రాముఖ్యత కలిగిన ఆనా వాళ్లపై మంత్రి ఆరా తీశారు కోటను తిలకించేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంత్రికి వివరించారు. సెలవు దినాల్లో పర్యాటకులు మరింత రెట్టింపు స్థాయిలో వస్తారని తెలిపారు. తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పర్యాటకులు కౌలస్ కోటను సందర్శిస్తారని మంత్రికి వివరించారు.

ప్రాచీన కట్టడాలకు నిదర్శనం కౌలాస్ కోట అని మంత్రి కొనియాడారు. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంత్రిని కోరారు దీనిపై మంత్రి స్పందిస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోట ఇప్పటికి చెక్కుచెదరలేదని అన్నారు. అప్పటి కట్టడాలు చూస్తే నేటికీ చెక్కుచెదరకుండా ఉండడమే అప్పటి నైపుణ్యత కు నిదర్శనమని అన్నారు. అప్పటి రాజరిక పరిపాలన కాలంలో కౌలాస్ కిల్లాగా పిలిచారని అన్నారు. కౌలాస్ కోట అభివృద్ధి కోసం సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పర్యాటకశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, బాన్సువాడ అదనపు కలెక్టర్ కిరణ్ మై, బిచ్కుంద, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సౌజన్య, ప్రమోద్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు రాములు సెట్, సాయ గౌడ్ ,లక్ష్మణ్ గొండ, సురేష్ గుండా, దిలీప్ పాటిల్ నాగేశ్వరరావు, సంపత్ రెడ్డి, మల్లికార్జున అప్ప, తదితరులు పాల్గొన్నారు.