నీలం మధును కలిసిన అద్దంకి దయాకర్
07-12-2024 04:16 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ను కాంగ్రెస్ TPCC జనరల్ సెక్రెటరీ అద్దంకి దయాకర్, షెడ్యూల్డ్ ట్రైబల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ లు శనివారం చిట్కుల్ లోని ఎన్ఎమ్ఆర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నీలం మధు తల్లిదండ్రుల విగ్రహాలకు వారు నివాళులర్పించారు. అనంతరం స్థానిక అంశాలపై వీరు చర్చించారు.




