calender_icon.png 1 August, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం రిజర్వాయర్‌లో మంత్రి జూపల్లి బోటు షికార్

01-08-2025 12:23:40 AM

నాగర్ కర్నూల్ జూలై 31 (విజయక్రాంతి): శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు గురువారం బోట్ నడిపా రు. బ్రహ్మగిరి (ఈగలపెంట)వద్ద మినీ లాంచీని పరిశీలించారు.

బ్రహ్మగిరి నుంచి అక్కమహాదేవి వరకు పర్యాట కులకు వెంట నే బోట్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఒక బోటుకు అదనంగా మరో బోటు ను అందుబాటులోకి తీసుకురావాలని, ఒక డ్రైవర్ ను స్పేర్ లో ఉంచాలనిసూచించారు.