01-08-2025 12:24:39 AM
బెజ్జూరు, జులై 31: కుమ్రంభీం జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 275 మంది విద్యార్థులు చదువుతుండగా వీరందరికీ మధ్యాహ్న భోజన సమయంలో కాళ్లు చేతులు, ప్లేట్లు కడుకునేందుకు ఒకే ఒక్క బోరు అందుబాటులో ఉంది. దీంతో గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండి తమ పాత్రలను శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. స్కూల్‌లో మరుగుదొడ్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.