calender_icon.png 5 September, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం

05-09-2025 12:35:04 AM

-గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

-స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణం

-రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆందోల్(సంగారెడ్డి), సెప్టెంబర్ 4 (విజయక్రాంతి):ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి ని యోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్ కార్డుల పంపిణీ, షాదీ ముబారక్, క ళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జహీరాబాద్ ఎంపీ సు రేష్ షెట్కార్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సంగారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే లు చింత ప్రభాకర్, సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు పేదల సం క్షేమం కోసం కట్టుబడి ఉంటుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదలకు రుణ సహాయం, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ అందించడం, సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు జిల్లాలో 39,000 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో 213 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.