05-08-2024 08:56:46 PM
హైదరాబాద్: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా పర్యాటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రరాజ్యంలో ఉన్న పలువురు ప్రవాస భారతీయులతోనూ సమావేశమయ్యారు. సీఎంతో పాటు కలిసి మంత్రి కోమటిరెడ్డి కూడా ఎన్ఆర్ఐ ప్రతినిధుల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 12వ తేదీన రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ సంస్థ సీఈవోతో భేటీ కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం అధునాతన యంత్రాలను పరిశీలించనున్నారు.