05-08-2024 10:02:27 PM
హైదరాబాద్: బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుడు చలపతి రావు అనే వ్యక్తి మారువేషాలతో తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్ లోని ఓ ఎస్బీఐ బ్యాంకులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన నిందితుడు చలపతి రావు నకిలీ పత్రాలతో బంధువులకు రూ.50 లక్షలు రుణం ఇప్పించాడు. 2002లో బంధువులకు రుణం ఇప్పించిన నిందితుడు చలపతి రావుపై సీబీఐ 2004లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. పేర్లు, వేషాలు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్న చలపతి రావు జీమెయిల్, ఫోన్ నంబర్లను ట్రాక్ చేసిన పోలీసులు నిందితుడు శ్రీలంక పారిపోతున్నట్లు గుర్తించారు. నిందితుడు చలపతిరావును పోలీసులు ఆదివారం తమిళనాడులో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు.