calender_icon.png 9 August, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగ్నిజెంట్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

05-08-2024 08:07:11 PM

అమెరికా: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసు కోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటిస్తున్నారు. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు.

హైదరాబాద్ లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ అంగీకారించిందని సీఎం పేర్కొన్నారు. మిలియన్ చదరపు అడుగుల విస్తీరణంలో హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కార్యాలయం ఏర్పాటు చేయనుంది. నూతన కార్యాలయంతో సుమారు 15 వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రెండో శ్రేణి నగరాల్లోనూ కంపెనీ ఏర్పాటు చేయాలని రవికుమార్ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.