03-07-2025 11:13:30 AM
హైదరాబాద్: కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో(Meenakshi Natarajan) మంత్రి కొండా సురేఖ దంపతులు(Minister Konda Couple) గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి నటరాజన్‌తో ప్రత్యేక సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై కొండా దంపతులు వివరించారు. గ్రూప్ రాజకీయాలపై మీనాక్షి నటరాజన్‌కు కొండా మురళి(Konda Murali) వివరించారు. ఈ సందర్భంగా కొండా మురళి మీనాక్షి నటరాజన్‌కు 16 పేజీల లేఖ ఇచ్చారు. నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఇన్‌ఛార్జి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ... తాను వెనకబడిన వర్గాల ప్రతినిధినని, ఒకరి గురించి తాను కామెంట్ చేయనని వివరించారు. తనకు ప్రజా బలం ఉందన్న కొండా మురళి చాలా కేసులకే తాను భయపడలేదన్నారు. తనకు భయం లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాని పునరుద్ఘాటించారు. నేను బీసీ కార్డును పట్టుకునే బతుకుతున్నానని కొండా మురళి అన్నారు. పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే జనం నా వద్దకు వస్తారని వెల్లడించారు. నాకు ప్రజాబలం ఉంది.. పనిచేసే వారిపైనే బండలు వేస్తారని కొండా మురళి పేర్కొన్నారు. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చిన గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటానని తెలిపారు. మిమ్మల్ని పార్టీ ఉపయోగించుకోవాలని చెప్పానన్నారు. పార్టీకి మీ సేవలు అమసరమని మీనాక్షీ చెప్పారని కొండా మురళి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, రేవంత్ రెడ్డిని ఇంకో 10 ఏళ్లు సీఎంగా చూడడం నా ఉద్దేశ్యమని కొండా మురళి ప్రకటించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అండగా నిలుస్తానని తెలిపారు.
నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నా..: మంత్రి కొండా సురేఖ
నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నానని మంత్రి వివరించారు. నా శాఖలో ఉన్న ఫైల్స్ అన్ని పరిశీలించుకోవచ్చని కొండా సురేఖ తెలిపారు. మంత్రిగా తాను ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేయలేదని వెల్లడించారు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించానని పేర్కొన్నారు. సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తం అన్నారు. నా కూతురికి మా ఆలోచనలు వంశ పారంపర్యంగా రావడంలో తప్పు లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. సుష్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేమని మంత్రి పేర్కొన్నారు.