calender_icon.png 4 July, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన సదస్సు

03-07-2025 06:03:34 PM

చివ్వేంల: చివ్వేంల మండలం చందుపట్ల గ్రామంలో ప్రపంచ పర్యావరణంలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలను చైతన్యపరిచే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ బాల సుబ్రహ్మణ్యం(Project Manager Bala Subramanyam) పాల్గొని ప్లాస్టిక్ పెనుభూతం లాంటిది దాని వలన పర్యావరణానికి చాలా ప్రమాదం జరుగుతుంది కనుక ప్లాస్టిక్ ని నిషేధించాలి. అలాగే పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ప్లాస్టిక్ లేని సమాజాన్ని రూపొందించాల్సిందిగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్సిడెంట్ మేనేజర్ కొండల రావు,హైవే సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.