calender_icon.png 4 July, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..

03-07-2025 05:53:23 PM

నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో దాడి..

నెన్నల మండలంలో దారుణం..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): అనుమానమే పెనుభూతమై ఓ మహిళను బలి తీసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా(Mancherial District) కన్నెపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. నెన్నల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నల మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల తులసి(35)ని తెల్లవారుజామున ఆమె భర్త ముడిమడుగుల తిరుపతి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమెపై ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో తులసీ అక్కడికక్కడే మృతి చెందింది. భార్య తులసిపై అనుమానం పెంచుకున్న తిరుపతి ఆమెపై కోపం పెంచుకున్నాడు. అది కాస్త ఆమెను అంతమొందించే వరకు దారితీసింది.

ముడిమడుగుల తిరుపతి తాగుడుకు బానిసయ్యి పనిపాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. భర్త తాగుడుకి బానిస కావడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం తులసి కూలి పనికి వెళ్తుండేది. ఈ క్రమంలో భార్యపై మరింత అనుమానం పెంచుకున్నాడు తిరుపతి. ఆమెను ఎలాగైనా చంపాలని స్కెచ్ వేశాడు. ఇంట్లోనే నిద్రిస్తున్న ఆమెపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడం గ్రామంలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్(ACP Ravikumar) పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.