calender_icon.png 4 July, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

03-07-2025 05:39:09 PM

రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల పిలుపు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఈ నెల 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మె(General Strike)ను జయప్రదం చేయాలని, ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాలని సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్నపు సోమయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కొత్తపల్లి రవి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సనప పొమ్మయ్య అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెరుమాళ్ళ జగన్నాథం భవనంలో ఆకుల రాజు అధ్యక్షతన కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ... ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు పోరాడి సాధించుకుంటే, కేంద్ర ప్రభుత్వం పన్నెండు గంటలు పని చేయాలని, నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు. కార్మికులకు కనీస ప్రయోజనాలు కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. మోడీ ప్రభుత్వం పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమీకరణ కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు కుంట ఉపేందర్, శివారపు శ్రీధర్, రేషపల్లి నవీన్, బిళ్ళ కంటి సూర్యం, భాస్కర్ రెడ్డి, పర్వతం కోటేష్, హలవత్ లింగ్యా, రైతు సంఘాల నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, నల్లపు సుధాకర్, గుజ్జు దేవేందర్, బండపల్లి వెంకటేశ్వర్లు, దుడ్డేలా రామ్మూర్తి, సమ్మెట రాజమౌళి, కుమ్మరి కుంట్ల నాగన్న, పట్ల మధు, తదితరులు పాల్గొన్నారు.