03-07-2025 05:55:24 PM
వలిగొండ (విజయక్రాంతి): మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మంది విద్యార్థులకు మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్(Mandal Education Officer Sunkoju Bhaskar) చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంచి విద్యను అభ్యసించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.