calender_icon.png 3 July, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకుడు గుంతల నిర్మాణం వేగవంతం చేయాలి

03-07-2025 11:38:50 AM

  1. ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎంపీడీవో, ఎంపీవో,

చిలుకూరు: ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని,ఎంపీడీవో గిరిబాబు, ఎంపీఓ నరసింహారావు  అన్నారు. బుధవారం చిలుకూరు గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ పధకం కింద మంజూరైనా ఇంకుడు గుంతల కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,  ఇంకుడు గుంతల నిర్మాణం వల్లన నీటి వృధాను అరికట్టడంతో పాటు, భూగర్భ జాలాలు పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. చిలుకూరులో వ్యక్తిగత ఇంకుడు గుంతలు 50,   కమ్యూనిటీ తరహలో ఆరు ఇంకుడు గుంతలు మంజురు అయినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో  గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్, ఏపీవో నిర్మల, టీఏ మాధవి, వివిధ పార్టీల నాయకులు   అలస కాని వెంకటయ్య, చిలువేరు ఆంజనేయులు, పొందూరు రమేష్, కస్తూరి సత్యం, దొంత గాని  నరసింహారావు,  కొండ నరేష్,తిరుమల రావు, భద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.