03-07-2025 06:14:05 PM
వరంగల్/మహబూబాబాద్ (విజయక్రాంతి): శ్రీ భద్రకాళి దేవస్థానం(Sri Bhadrakali Temple)లో శాఖంబరి నవరాత్ర మహోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఎనిమిదవ రోజు శ్రీ భద్రకాళి మాత ఉగ్ర ప్రభ, త్వరితమాతగా అలంకార రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు ఉదయం 4 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల పెద్ద ఎత్తున హాజరై భద్రకాళి మాత్రం దర్శించుకున్నారు.
శాకాంబరి వేడుకలకు ఏర్పాట్లు..
ఈనెల 10న నిర్వహించనున్న శాకాంబరి వేడుకల ఏర్పాట్లను ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, ఓరుగంటే పూర్ణచందర్, తొగరు క్రాంతి, సతీష్, మోతుకూరి మయూరి రామేశ్వరరావు, గాండ్ల స్రవంతి, పాలడుగు ఆంజనేయులు, కారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, ఆలయ ఈవో శేషభారతి, మట్టేవాడ సిఐ గోపి ట్రాఫిక్ ఎస్ఐ సాయి కిరణ్ సమీక్షించారు. శాకంబరి వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని, భక్తులకు దర్శనంతో పాటు ఉచితంగా ప్రసాదం, తాగునీరు, బాదాం మిల్క్, మజ్జిగ అందజేయాలని నిర్ణయించారు. అలాగే గత సంవత్సరం జరిగిన చిన్న చిన్న పొరపాట్లను పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించారు. వర్షం వచ్చే అవకాశం ఉండందున వాటర్ ప్రూఫ్ పెండల్స్ ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ఏర్పాట్లను, దర్శనం అనంతరం తిరిగి నగరంలోకి ప్రవేశించే విధంగా ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. వన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో ధర్మకర్తలు ఉసిరి, మందార మొక్కలను నాటారు.