calender_icon.png 3 July, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి

03-07-2025 05:23:22 PM

ఎంపీడీవో రాజేశ్వర్..

మందమర్రి (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్(MPDO Rajeshwar) కోరారు. మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీలో వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణం పరిరక్షించడంతో పాటు పచ్చదనం పెంపొందుతుందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సునీత, హౌసింగ్ ఏఈ జోష్ణ, పంచాయతీ కార్యదర్శి హరీష్, ఈజిఎస్ టిఏ రాజమల్లు, ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య, కాంగ్రెస్ నాయకులు మాసు సంతోష్ కుమార్, బేర సమ్మయ్య, గ్రామస్తులు బొజ్జ రాజమణి, సంకే సమ్మక్క, ముప్పిడి అంజయ్య, వెంకన్న, లు పాల్గొన్నారు.