calender_icon.png 4 July, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాన గుణం ఉన్నవారే గొప్పవారు

03-07-2025 05:43:24 PM

దాతల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఆకర్షణీయంగా ప్రీ ప్రైమరీ తరగతి గది..

కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మయ్య..

చిన్నకోడూరు: ధనవంతులు అందరికి దానగుణం ఉండదని.. దాతృత్వ హృదయం ఉన్నవారే గొప్పవారని చిన్నకోడూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య(Principal Lakshmaiah) అన్నారు. గురువారం మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో లయన్ ఉజ్వల మోదాని పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులందరికీ 5 వేల విలువగల నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిలను అందించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ ప్రత్యేక తరగతి గదిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామంచ ప్రాథమిక పాఠశాలలో దాతల సహాయంతో లక్షలాది రూపాయల కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.

దాతలు అందించే చేయూతను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలన్నారు.  తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చేలా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ తరగతి ఎంతో ఆకర్షినియంగా ఉందన్నారు. విద్యార్థులు కూడా ఆసక్తిగా వివిధ ఆటలాడుతూ సంతృప్తి చెందుతున్నారన్నారు. విద్యార్థులకు  చేయూతను అందించిన ఉజ్వల మోదానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా షరీఫ్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ భారతమ్మ, ప్రేమలత, వివో పద్మ, ఉపాధ్యాయులు వై.వి. సురేష్ కుమార్, వరప్రసాద్,లలిత, సునీత, నాగమణి, వాణి తదితరులు పాల్గొన్నారు.