జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
కోరుట్ల
జగిత్యాల, ఆగస్టు 20 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్మ న్ కుమార్ గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహ్నం 12 గంటలకు ధరూర్ క్యాంప్ చేరుకొని జిల్లా లో నూతనంగా మంజూరైన జగిత్యాల, మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం 12:30 గంటలకు జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి చేరుకుని, 1 గంట నుంచి 1:30 గంటల వరకు కాలనీని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 4:30 గంటల వరకు జగిత్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
సాయంత్రం 4:30 గంటల నుంచి 7:00 గంటల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.






