సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆహ్వానం
21-03-2026 04:05 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 25 నుండి ఏప్రిల్ 6 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ పాలక మండలి ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్, ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ,అర్చకులు శేషం వంశీధరాచార్యులు, మడికొండ నవీన్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.




