15 April, 2026 | 6:16 PM

ఆదిలాబాద్ రోడ్లపై మంత్రి పొన్నం వాహన డ్రైవింగ్

15-04-2026 02:05 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని పలు రోడ్లు గుండా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar ) ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి  పట్టణంలోని ప్రధాన రోడ్లపై మంత్రి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వేడమ బొజ్జు పటేల్ లు హెల్మెట్ ధరించి స్వయంగా ద్విచక్ర వాహనాలను నడుపుతూ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు